గద్దర్ కొడుకు బెల్లంపల్లి నుంచి పోటీ?

ప్రజాగాయకుడు గద్దర్ తనకు మహాకూటమి మద్దతు ఇస్తే గజ్వేల్ నుంచి సిఎం కేసీఆర్‌పై పోటీ చేస్తానని చెపుతున్నా, ప్రతిపక్ష పార్టీలేవీ స్పందించలేదు. కానీ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన కుమారుడు సూర్య కిరణ్ మాత్రం మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ టికెట్ పై పోటీ చేయబోతున్నారట. నిన్న జరిగిన కాంగ్రెస్‌ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో సూర్యకిరణ్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. అయితే మహాకూటమిలో సీట్ల సర్దుబాట్లు పూర్తయిన తరువాత రెండవ జాబితాలో సూర్యకిరణ్ పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సూర్యకిరణ్ కు బెల్లంపల్లి టికెట్ ఖరారు చేసినట్లయితే గద్దర్ ఇక గజ్వేల్ నుంచి పోటీ చేసే ఆలోచనను విరమించుకొని కొడుకుకు మద్దతుగా బెల్లంపల్లిలో జోరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చని తెలుస్తోంది.