త్వరలో ప్రధాని మోడీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం

 ప్రధాని నరేంద్ర మోడీ నవంబరు నెలలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ మీడియాకు తెలిపారు. వచ్చే నెలలో హైదరాబాద్‌, నిజామాబాద్, సూర్యాపేటలో మూడు బహిరంగసభలలో పాల్గొంటారని లక్ష్మణ్ తెలిపారు. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ షెడ్యూల్ ఖరారు అవుతుందని తెలిపారు. 

ఇప్పటికే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రెండుసార్లు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేసి వెళ్లారు. మళ్ళీ ఎల్లుండి ఆదివారం మరోసారి ప్రచారానికి రాబోతున్నారు. ఆ తరువాత ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తే తెలంగాణలో ఎన్నికల వేడి మరింత పెరుగుతుంది. 

రాష్ట్రంలో తెరాస చాలా ఉదృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ దూసుకుపోతుంటే, మహాకూటమి సీట్ల పంపకాలలో తలమునకలై ప్రచారంలో వెనుకబడిపోయింది. బిజెపి 38 మందితో మొదటి జాబితా ప్రకటించినప్పటికీ, తెరాసతో పోలిస్తే ఎన్నికల ప్రచారంలో చాలా వెనుకబడిపోయుంది. కనుక ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాల ఎన్నికల ప్రచారంతో రాష్ట్ర  బిజెపి శ్రేణులలో నూతన ఉత్సాహం కలుగుతుంది.