
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ములుగు నుంచి బరిలో దిగుతున్న మంత్రి అజ్మీరా చందూలాల్ కు ఎన్నికల ప్రచారంలో అడుగడుగునా అసమ్మతిసెగలు తగులుతూనే ఉన్నాయి. అసమ్మతి నేతలు మంత్రిగారి అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం నియోజకవర్గంలో ర్యాలీకి సిద్దపడటంతో ఇరువర్గాల మద్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. వారికి అధిష్టానం ద్వారా నచ్చ జెప్పి ఉండి ఉంటే పరిస్థితులు ఏవిదంగా ఉండేవో కానీ చందూలాల్ కుమారుడు ప్రహ్లాద్ తన అనుచరులతో కలిసి అసమ్మతివాదులపై దాడులకు పాల్పడటంతో ములుగు నియోజకవర్గంలో ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా మంత్రిగారికి నిరసనలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ నేపద్యంలో ఆయన పోలీసుల రక్షణలో మంగళవారం ములుగు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవలసి వచ్చింది.