పొత్తులపై విజయశాంతి వ్యాఖ్యలు

మహాకూటమిలో సీట్ల సర్దుబాట్లపై చర్చలు సాగున్నకొద్దీ దానిలో భాగస్వామ్యపార్టీల నేతలే వాటిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ స్టార్ కేంపెయినర్ విజయశాంతి కూడా సీట్ల సర్ధుబాట్లపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, “తెరాసను ఎదుర్కొని దానిని ఓడించాలంటే మహాకూటమిలో అన్ని స్థానాలలో బలమైన అభ్యర్ధులను నిలబెట్టడం చాలా అవసరమని మిత్రపక్షాలు గ్రహించాలి. కానీ పొత్తులలో భాగంగా మిత్రపక్షాలు కాంగ్రెస్ పార్టీ అవలీలగా గెలుచుకోగల స్థానాల కోసం పట్టుబట్టడం సరికాదు. మిత్రపక్షాలు గెలుచుకోగల స్థానాలను మాత్రమే కోరుకొంటే బాగుంటుంది. ఈ చర్చల ప్రక్రియ ఎంత త్వరగా ముగించి అభ్యర్ధుల పేర్లు ప్రకటించి ఎన్నికల ప్రచారం మొదలుపెడితే అంత మంచిది. ఆలస్యం అవుతున్న కొద్దీ మనమే నష్టపోతాము,” అని అన్నారు.