నాగం కుమారుడు మృతి

సీనియర్ కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డి పెద్ద కుమారుడు నాగం దినకర్ రెడ్డి (48) గురువారం రాత్రి హైదరాబాద్‌లోని ఆపోలో ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయన గత కొంత  కాలంగా ఊపిరితిత్తుల సంబందిత వ్యాధితో బాధపడుతున్నారు. నాగర్‌కర్నూల్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్న నాగం జనార్ధన్ రెడ్డి కుమారుడి మరణవార్త విని హుటాహుటిన హైదారాబాద్ చేరుకొన్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారిలో పెద్దవాడైన దినకర్ రెడ్డి కాంట్రాక్ట్ పనులు చేస్తుండేవారు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. పుత్రశోకంతో బాధపడుతున్న నాగం జాబార్ధన రెడ్డిని కాంగ్రెస్ నేతలు ఓదార్చుతున్నారు.