
మహాకూటమిలో పార్టీల నేతలు మంగళవారం మరోసారి సమావేశం కానున్నారు. ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించబడింది కనుక ఇక సీట్ల సర్దుబాట్లపై ఆలస్యం చేయరాదని మహాకూటమి నేతలు భావిస్తున్నారు. కనుక రేపటి సమావేశంలో ఈ అంశంపై ఏదో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ఒకవేళ ఆ తంతు పూర్తయితే, ఆ తరువాత ఏ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ పోటీ చేయాలనే దానిపై చర్చలు మొదలవుతాయి. సీట్ల సర్దుబాట్లు ఎంత కష్టమో నియోజకవర్గాలను కేటాయించుకోవడం అంతకంటే ఎక్కువ కష్టం. కనుక మహాకూటమి అభ్యర్ధుల ప్రకటనకు మరొక 4-5 రోజులు పట్టవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, డికె అరుణ, షబీర్ ఆలీ, జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి వంటి ముఖ్యనేతలు వారు ఇదివరకు పోటీ చేసిన స్థానాల నుంచే పోటీ చేయడం ఖాయం గనుక రేపటి సమావేశంలో మహాకూటమి భాగస్వామ్యపక్షాల నుంచి ఆ స్థానాలకు అంగీకారం పొందగలిగితే ముందుగా వారి పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.