మిషన్ భగీరధ త్రవ్వకాలలో బయటపడిన వెండి నాణేలు

మంచిర్యాల జిల్లాలో  కాసిపేట మండలం ధర్మారావుపేట బెస్తవాడలో మిషన్‌ భగీరథ పధకంలో భాగంగా త్రవ్వకాలు జరుపుతుండగా ఒక వలస కూలీకి 338 వెండి పురాతన వెండి నాణేలు లభించాయి. వెండి నాణేలు బయటపడిన సంగతి తెలుసుకొని గ్రామస్తులు అందరూ అక్కడికి చేరుకొని వాటిని ఆసక్తిగా చూశారు. ఈ సంగతి ఆనోటా ఈ నోటా పడి అధికారుల చెవిన పడింది. వెంటనే దేవాపూర్ ఎస్.ఐ. దేవయ్య, తహశీల్దార్ ప్రసాద్ వర్మ అక్కడకు చేరుకొని, నిజాం కాలం నాటి ఆ నాణేలను స్వాధీనం చేసుకొని పంచనామా నిర్వహించారు. వాటిని పురావస్తు శాఖకు అప్పగిస్తామని తెలిపారు.