
నాలుగు రోజుల క్రితం రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహ తదితరులు వారి బందువులు, స్నేహితుల ఇళ్ళపై ఐటి అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. మళ్ళీ నిన్న (ఆదివారం) చైతన్యపురి వద్ద జైపూరి కాలనీలో నివాసం ఉంటున్న ఉదయ్ సింహ బందువుల ఇళ్ళపై ఐటి అధికారులు దాడులు చేసారు.
ఈరోజు హైదరాబాద్‌లో ఐటి కార్యాలయంలో విచారణకు హాజరయిన ఉదయ్ సింహ ‘నిన్న తన బందువుల ఇళ్ళపై ఎందుకు దాడులు చేశారని ప్రశ్నించగా ఐటి అధికారులు షాక్ అయ్యారు. ఎందుకంటే వారు ఆదివారం ఎవరి ఇళ్ళపై దాడులు చేయలేదట! వారి జవాబు విని ఉదయ్ సింహ కూడా షాక్ అయ్యారు. ఐటి అధికారులమని చెప్పుకొంటూ ఇంట్లో ప్రవేశించి విలువైన బంగారు ఆభరణాలు, నగదు, విలువైన సెల్ ఫోన్స్ వగైరాలు పట్టుకు వెళ్లారని ఉదయ్ సింహ ఫిర్యాదు చేశారు. దీంతో ఐటి అధికారులు షాక్ అయ్యారు. ఇంతకీ ఈ పని ఎవరు చేశారు? ఈ దాడులకు ఎవరు బాధ్యులు వహిస్తారని ఉదయ్ సింహ ప్రశ్నిస్తున్నారు. తెల్లనివన్నీ పాలు కానట్లే, నాలుగు వాహనాలలో వచ్చిన వారందరూ ఐటి అధికారులు కాకపోవచ్చునని అర్ధం అవుతోంది.