ఐటి దాడులపై రేవంత్ రెడ్డి రియాక్షన్

తెలంగాణా కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తనపై, తన బందువులు, స్నేహితుల ఇళ్ళపై జరిగిన ఐటిి దాడులపై శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. 

నన్ను నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకనే సిఎం కెసిఆర్‌ మోడీ సహాయసహకారాలతో నాపై ఐటిు దాడులు జరిపించారు. వాటిపై ఒక వర్గం మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను చూసిన తరువాత నేను స్పందించడం అవసరమని భావించి మీ ముందుకు వచ్చాను. ఒకప్పుడు మీడియాలో నిష్పాక్షిపాతంగా వార్తలు వచ్చేవి కానీ ఇప్పుడు మీడియాలో కొందరు రాజకీయ పార్టీలకు, నాయకులకు అమ్ముడుపోయి నిరాధారమైన వార్తలు వండి వార్చేస్తున్నారు. ఇప్పుడూ అదే జరిగింది. హైదరాబాద్‌లో ఉన్న నా ఇళ్లను అనేక ఏళ్ళ నుంచి అద్దెలకు ఇస్తున్నాను. వాటిలో ఎవరెవరో ఏవేవో సంస్థలు పెట్టుకొని నడిపించుకొంటే అది నా తప్పా?అవన్నీ నా సంస్థలు అయిపోతాయా? 

నా ఇళ్ళు, పొలాలు, ఇతర స్థలాలు వగైరాలన్నీ నేను కొన్నపుడు ఏ ధరతో రిజిస్ట్రేషన్ చేయించుకొన్నానో అదే ఎన్నికలలో ఎఫిడవిట్ లో పేర్కొన్నాను. వాటి మార్కెట్ రేట్ క్రమంగా పెరగడంతో 2014లో ఎన్నికల ఎఫిడవిట్ లో పెరిగిన ధరలను పేర్కొన్నాను. అది తప్పు ఎలా అవుతుంది? 

ఇక నాకు హాంకాంగ్, మలేషియాలో బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని వాటి ద్వారా వందల కోట్లు అక్రమ లావాదేవీలు చేశానని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ అందరూ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఆ దేశంలో పౌరసత్వంలేనివారికి అక్కడ బ్యాంక్ అకౌంట్లు తెరిచేందుకు ఆ దేశంలో చట్టాలు ఒప్పుకోవు. అయినా నేను 2014 తరువాత నేను ఏనాడూ ఆ దేశాలకు వెళ్లలేదు. మరి అక్కడ నాకు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని వాటి ద్వారా వందల కోట్లు అక్రమ లావాదేవీలు జరిపానని ఏవిధంగా ఆరోపిస్తున్నారు? 

అందరూ తెలుసుకోవలసిన మరో విషయం ఏమిటంటే, నాకు పిల్లనిచ్చిన మామపేరు పధ్మనాభరెడ్డి. ఆయన పుట్టుకతోనే కోటీశ్వరుల కుటుంబంలో పుట్టారు. ఆ తరువాత ఆయన అనేక వ్యాపారాలు చేసి మరింత డబ్బు సంపాదించారు. ఒకప్పుడు ఆయనకు తార్నాకలో వందల ఎకరాల భూమి ఉండేదంటే ఆయన ఎంత ధనికుడో అర్ధం చేసుకోవచ్చు. కనుక ఆగర్భ శ్రీమంతులైన వారికి అన్ని భూములు ఎక్కడివి? అంత ఖరీదైన కార్లు ఎక్కడివి? అంతా డబ్బు ఎక్కడిది? వారు నాకు ఏమేమి ఇచ్చారు? వాటి విలువ ఎంతుంటుంది? అని తెలుసుకోకుండా నోటికి వచ్చినట్లు టిఆర్ఎస్‌ నేతలు పేలుతున్నారు. 

మళ్ళీ చెపుతున్నాను నేను ఏనాడూ సిఎం కెసిఆర్‌ లాగా అక్రమంగా ప్రజల డబ్బు దోచుకొని దాచుకోలేదు. ఎన్నడూ అవినీతి సంపాదనకు ఆశపడలేదు. నా ఆస్తులన్నిటి లెక్కలు ఐటిా, రెవెన్యూ అధికారుల దగ్గరే ఉన్నాయి. కనుక వాటి గురించి నాకంటే వారికే బాగా తెలుసు. రాజకీయ దురుదెశ్యంతో జరిగిన ఈ ఐటిు దాడులు చూసి నేను భయపడబోను. కెసిఆర్‌కు దమ్ముంటే ఆయన కుటుంబ సభ్యులవి, నా ఆస్తులపై సిట్టింగ్ జడ్జ్ తో దర్యాప్తు జరిపించుకోవడానికి రమ్మనమని సవాలు విసురుతున్నాను,” అని అన్నారు.