ముందస్తు అభ్యంతరాలు కుదరవు: హైకోర్టు

ముందస్తు ఎన్నికలను రకరకాల కారణాలతో వ్యతిరేకిస్తూ దాఖలవుతున్న పిటిషన్లను హైకోర్టు కొట్టివేస్తూనే ఉంది. ఎన్నికలలో ప్రజలను ప్రభావితం చేసేవిధంగా ఉన్న రైతుబంధు పధకాన్ని అమలు చేయరాదంటూ వేసిన ఒక పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అలాగే తెలంగాణాలో ఓటర్ల తుది జాబితా గడువును కేంద్ర ఎన్నికల కమీషన్ కుదించడాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషనును కూడా హైకోర్టు కొట్టివేసింది. అసెంబ్లీని రద్దు చేసిన 6 నెలలలోపు ఎన్నికలు నిర్వహించవలసి ఉంది గనుక ఈ విషయంలో ఎన్నికల కమీషన్ తగిన నిర్ణయం తీసుకొనే అధికారం కలిగి ఉందని, కనుక గడువును కుదించడాన్ని తప్పుగా భావించలేమని హైకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ తేల్చి చెప్పారు.