కరీంనగర్-ముంబై ఎక్స్ ప్రెస్ నేడే ప్రారంభం

కరీంనగర్ నుంచి ముంబై మహానగరానికి ఎక్స్ ప్రెస్ రైల్ సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. కరీంనగర్-ముంబై లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నెంబర్: 11206)ను కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు మధ్యాహ్నం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పచ్చ జెండా ఊపి ప్రారంభిస్తారు. అదే సమయంలో కరీంనగర్ రైల్వే స్టేషన్‌లో ఎంపీ వినోద్ కుమార్ పచ్చ జెండా ఊపి ప్రారంభిస్తారు. ప్రస్తుతానికి వారానికి ఒక్కరోజు మాత్రమే ఈ ఎక్స్ ప్రెస్ రైల్ సర్వీస్ నడుస్తుంది. 

ప్రతీ శనివారం సాయంత్రం 4.40 గంటలకు ముంబై లోకమాన్య తిలక్ రైల్వే స్టేషన్‌ నుంచి బయలుదేరి ఆదివారం మధ్యాహ్నం 12.45 గంటలకు కరీంనగర్ చేరుకొంటుంది. మళ్ళీ ఆదివారం సాయంత్రం 7.45 గంటలకు కరీంనగర్ నుంచి బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 1.45 గంటలకు ముంబై చేరుకొంటుంది.