అక్టోబర్ 3నుంచి కెసిఆర్‌ ఎన్నికల ప్రచార సభలు

సిఎం కెసిఆర్‌ వచ్చే నెల 3వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతున్నారు. ముందుగా అక్టోబర్ 3వ తేదీన ఉమ్మడి నిజామాబాద్ ల్లాలో, 4న ఉమ్మడి నల్గొండ జిల్లాలో, 5న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో, అక్టోబర్ 7న ఉమ్మడి వరంగల్ జిల్లాలో, అక్టోబర్ 8న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారసభలు నిర్వహిస్తారు. నిజామాబాద్‌లో స్థానిక గిరిరాజ్ కళాశాల మైదానంలో లేదా నగర శివార్లలో గానీ బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు. ఎంపీ కవిత, మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఈ సభకు అవసరమైన ఏర్పాట్లు, జనసమీకరణ బాధ్యతలు అప్పగించారు. మళ్ళీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాత తదుపరి ప్రచారసభలు షెడ్యూల్ ఖరారు చేయాలని సిఎం కెసిఆర్‌ నిర్ణయించారు. ఈరోజు ఎంపీ కవిత, పోచారం తదితర టిఆర్ఎస్‌ నేతలు నిజామాబాద్‌లో సభా వేదికలను పరిశీలిస్తారు.