ఉత్తమ హామీలు ఎన్నో...

ఒకపక్క కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చవలసిన హామీలపై ఇంకా చర్చిస్తుండగానే మరోపక్క టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వరుసగా ఎన్నికల హామీలను ప్రకటిస్తూనే ఉన్నారు. అందుకే ‘మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేయవలసిన అవసరం ఏమిటని’ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. 

వికారాబాద్ జిల్లాలో పరిగిలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మరికొన్ని కొత్త హామీలను ప్రకటించారు. ఆ వివరాలు: 

1. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారందరికీ కుటుంబంలో ఒక్కో మనిషికి 7 కేజీలు చొప్పున సన్న బియ్యం పంపిణీ.

2. రేషన్ డీలర్లుకు గౌరవ వేతనాలు.

3. డ్వాక్రా సంఘాలకు గ్రాంటు రూపంలో రూ.1 లక్ష, రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు మంజూరు.    

4. 4,000 సెర్ఫ్ ఉద్యోగులను క్రమబద్దీకరణ. 

5. ఉపాది హామీ ఉద్యోగుల డిమాండ్ల పరిశీలన.

6. జనాభా ప్రాతిపాధికన బీసీ సబ్ ప్లాన్ అమలు.

ఇవి కాక ఇదివరకే ప్రకటించినవి: 

1. రైతులకు ఒకేసారి రూ.2 లక్షల పంట రుణాలు మాఫీ.

2. రాష్ట్రంలో 10 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ. 3000 నిరుద్యోగభృతి ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.