
టిఆర్ఎస్ అభ్యర్ధులను ప్రకటించి అప్పుడే ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టేసింది కానీ కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్ధులనే ఖరారు చేయలేదు. కనుక టిఆర్ఎస్కు ధీటుగా రేవంత్ రెడ్డి, చిన్నారావు, జి.మధుసూధన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి తదితరులు కలిసి ఆదివారం వనపర్తి జిల్లాలో పెబ్బేరులో స్థానిక పిపిఎల్ మైదానంలో ‘పెబ్బేరు పొలికేక’ పేరుతో ఒక భారీ బహిరంగసభ నిర్వహించబోతున్నారు. దీనికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరుకాబోతున్నారు. ఈ సభకు భారీగా జనసమీకరణ చేసి సభను విజయవంతం చేసి టిఆర్ఎస్కు తమ సత్తా చూపాలని పట్టుదలగా అందరూ పనిచేస్తున్నారు. వనపర్తి, కొల్లాపూర్, దేవరకద్ర, మక్తల్, కొల్లాపూర్ తదితర ప్రాంతాల నుంచి జనసమీకరణ చేస్తున్నారు.