7.jpg)
జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ భూముల అవకతవకల వ్యవహారంలో వివరణ కోరుతూ జూబ్లీ హిల్స్ పోలీసులు తనకు నోటీసు పంపించడంపై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. “నాపై రాజకీయ కక్ష సాధించడానికే నాపేరును ఆ కేసులో ఇరికించి నోటీసు పంపించారు. ఆ కేసులో నేను దోషినని సిఎం కెసిఆర్ భావిస్తే నన్ను అరెస్ట్ చేయించమని డిమాండ్ చేస్తున్నాను. నను అరెస్ట్ చేస్తే ఏమవుతుందో కెసిఆర్‌కు రుచి చూపిస్తాను. దొంగ పాస్ పోర్టులపై విదేశాలకు మనుషులను అక్రమరవాణా చేసినట్లు ఆరోపిస్తూ జగ్గారెడ్డిని జైలుకి పంపించారు. ఈ వ్యవహారంలో సిఎం కెసిఆర్, మంత్రి హరీష్ రావులపై విచారణ జరిపిస్తే వారి కధలు కూడా బయటకు వస్తాయి. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందిగా గవర్నర్ నరసింహన్‌ను కోరుతున్నాను. ఒకవేళ ఆయన స్పందించకపోతే దీనికోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను.
సిఎం కెసిఆర్ ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. కానీ ఆయన ఎన్ని కుయుక్తులు ప్రయోగించినా త్వరలో జరుగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. అప్పుడు మేము కెసిఆర్ సంగతి తెలుస్తాము,” అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.