
తెలంగాణా శాసనసభ ఎన్నికలు నవంబర్ నెలాఖరులోగా జరుగవచ్చని సిఎం కెసిఆర్ చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ డిసెంబరులో జరుగుతాయని తాజా సమాచారం. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, మిజోరాం రాష్ట్రాలతో పాటు డిసెంబరులోనే తెలంగాణా శాసనసభకు కూడా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమీషన్ కు చెందిన ఒక సీనియర్ అధికారి పిటిఐ వార్తా సంస్థకు తెలియజేశారు. ఆ లెక్కన డిసెంబరు 15వ తేదీలోగా ఐదు రాష్ట్రాలలో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని ఆ అధికారి చెప్పారు. కనుక సిఎం కెసిఆర్ చెప్పినట్లుగా అక్టోబర్ మొదటివారంలో కాక రెండవ వారంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.