అసెంబ్లీ రద్దుపై హైకోర్టు ఏమి చెప్పిందంటే...

సిఎం కెసిఆర్‌ సుమారు 9 నెలల ముందుగా శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళడాన్ని సవాలు చేస్తూ రాపోలు భాస్కర్ అనే న్యాయవాది వేసిన పిటీషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఈ వ్యవహారంలో రాజ్యాంగ అతిక్రమణ ఏమీ జరుగలేదని, పైగా అసెంబ్లీ రద్దు వ్యవహారంలో న్యాయస్థానం జోక్యం చేసుకోలేదని చెపుతూ పిటీషన్‌ను కొట్టి వేసింది. కేవలం రాజకీయ గుర్తింపు కోసమే ఈ పిటీషన్‌ వేసినట్లు భావిస్తున్నామని న్యాయమూర్తి వ్యాఖ్యానించడం విశేషం.