.jpg)
మొన్న జగ్గారెడ్డి... నిన్న గండ్ర వెంకట రమణారెడ్డి సోదరులు... నేడు రేవంత్ రెడ్డి...ఇలా కాంగ్రెస్ నేతలపై పోలీసులు దృష్టి పెట్టి వారిపై ఉన్న పాత కేసులను పైకి తీస్తునట్లున్నారు. జూబ్లీ హిల్స్ పోలీసులు రేవంత్ రెడ్డికి నోటీసు పంపించారు.
వెస్ట్ జోన్ డిసిపి ఏఆర్. శ్రీనివాస్ ఈ కేసు గురించి మీడియాతో మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డితో సహా మొత్తం 13 మందికి నోటీసులు పంపించాము. జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో సభ్యులుగా ఉన్నప్పుడు వారు నకిలీ దృవపత్రాలతో ఇళ్ళ స్థలాలు అమ్ముకొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. వాటికి 15 రోజులలోపుగా సమాధానం ఇవ్వాలని కోరుతూ రేవంత్ రెడ్డితో సహా 13 మందికి నోటీసులు పంపించాము. అయితే ప్రస్తుతం ఎన్నికల హడావుడిలో ఉన్నందున సమాధానం చెప్పేందుకు తనకు మరికొంత సమయం ఇవ్వాలని రేవంత్ రెడ్డి మాకు లేఖ వ్రాశారు. ఈ కేసులో వారి వివరణ మాత్రమే కోరుతున్నందున ఎవరినీ అరెస్ట్ చేసే అవకాశం లేదు,” అని చెప్పారు.