గండ్ర సోదరులపై కేసు నమోదు

సీనియర్ కాంగ్రెస్‌ నేత గండ్ర వెంకట రమణారెడ్డి ఆయన సోదరుడు గండ్ర భూపాల్ రెడ్డిలపై పోలీసులు ఆయుధ చట్టం క్రింద మంగళవారం రాత్రి కేసు నమోదు చేశారు. ఇదివరకు వారి వ్యాపార భాగస్వామిగా ఉన్న ఎర్రబెల్లి రవీందర్‌రావు ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. అలాగే గండ్ర సోదరుల ఫిర్యాదు మేరకు ఎర్రబెల్లి రవీందర్‌రావు, అతని అనుచరులపై కూడా పోలేసులు ఆయుధ చట్టం క్రింద కేసు నమోదు చేశారు. గతంలో వారు కలిసి వ్యాపారలావాదేవీలు చేసినప్పుడు వారి మద్య గొడవలు జరిగి విడిపోయారు. గండ్ర సోదరులకు, ఎర్రబెల్లి రవీందర్‌రావుకు గోవిందాపూర్ శివారులో పక్కపక్కనే స్టోన్ క్రషర్ యూనిట్లున్నాయి. కనుక నేటికీ వారి మద్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఆ గొడవల కారణంగానే పరస్పరం పోలీసులకు పిర్యాదులు చేసుకోవడంతో వారిపై కేసులు నమోదు అయ్యాయి.