
సిఎం కెసిఆర్ ప్రకటించిన టిఆర్ఎస్ అభ్యర్ధుల మొదటి జాబితాలో దానం నాగేందర్ పేరు లేకపోవడంతో మొదలైన వివాదానికి టిఆర్ఎస్ ఫుల్ స్టాప్ పెట్టినట్లు తాజా సమాచారం. ఆయనకు ఘోషా మహల్ టికెట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. బుధవారం కాంగ్రెస్ పార్టీ నుంచి సురేశ్ రెడ్డితో సహా మరికొందరు నేతలు టిఆర్ఎస్లో చేరబోతున్నారు కనుక అప్పుడే దానంతో సహా మరికొందరు అభ్యర్ధుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.
అయితే దానం నాగేందర్ తనకు మంచి పట్టున్న ఖైరతాబాద్ నుంచి పోటీ చేయాలనుకొంటున్నట్లు టిఆర్ఎస్ అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది. కనుక రేపటిలోగా దానం నాగేందర్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే దానిపై స్పష్టత రావచ్చు.
కానీ ఖైరతాబాద్, ఘోషా మహల్ నుంచి పోటీ చేయాలని ఆశపడుతున్న టిఆర్ఎస్లో నేతలు కొత్తగా పార్టీలోకి వచ్చిన దానం నాగేందర్ కు ఆ టికెట్ కేటాయిస్తే ఊరుకొంటారా?వారికి లేదా దానం నాగేందర్ కు గానీ టికెట్ నిరాకరిస్తే ఏమవుతుంది? త్వరలోనే తెలుస్తుంది.