
గోకుల్‌చాట్, లుంబినీ పార్కు జంట ప్రేలుళ్ళ కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పు సోమవారం సాయంత్రం దోషులకు శిక్షలు ప్రకటించింది. ఈ కేసులో దోషులుగా పేర్కొనబడిన అనీఖ్, ఇస్మాయిల్ ఇద్దరికీ ఉరిశిక్ష దానితో పాటు రూ.10,000 జరిమానా విధించింది. వారికి ఆశ్రయం కల్పించినందుకు తారీక్ అంజూన్ కు జీవిత ఖైదు విధించింది.
2007, ఆగస్ట్ 25వ తేదీ సాయంత్రం గోకుల్‌చాట్, లుంబినీ పార్కు వద్ద జరిగిన ప్రేలుళ్ళలో మొత్తం 44 మంది చనిపోయారు. అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో సుల్తాన్ బజార్, దిల్ షుక్ నగర్ లో కూడా ప్రేలుళ్ళు జరపడానికి వారు బాంబులు అమర్చారు. కానీ అదృష్టవశాత్తు పోలీసులు ఆ బాంబులను కనుగొని వాటిని నిర్వీర్యం చేశారు లేకుంటే ఇంకా చాలా మంది ప్రాణాలు కోల్పోయేవారు.
ఈ ప్రేలుళ్ళ ప్రధాన సూత్రదారులు అమీర్ రెజాఖాన్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ ముగ్గురూ పరారీలోనే ఉన్నారు. వారిపై వేరేగా కేసులను నమోదు చేసి ఈ కేసు విచారణను 11 ఏళ్ళ తరువాత ఇవాళ్ళ ఈవిధంగా ముగించింది ఎన్.ఐ.ఏ. కోర్టు.