సంబంధిత వార్తలు

సిఎం కెసిఆర్ నిన్న శాసనసభ రద్దు చేసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ మొదటివారంలో ఎన్నికల షెడ్యూల్ జారీ అయ్యే అవకాశం ఉందని, నవంబర్ నెలాఖరులోగా ఎన్నికల ప్రక్రియ ముగిసే అవకాశం ఉందంటూ చేసిన ప్రకటనపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తద్వారా సిఎం కెసిఆర్ తన పరిధిని అతిక్రమించారని సిపిఐ నేతలు సురవరం సుధాకర్ రెడ్డి, నారాయణ కేంద్ర ఎన్నికల కమీషనర్ ఓపి రావత్ కు ఈరోజు ఫిర్యాదు చేశారు. ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించే అధికారం ఈసీకి మాత్రమే ఉందని కానీ కెసిఆర్ నిన్ననే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారని కనుక ఆయనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.