
హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసులు గత ఏడాది నవంబరు 29వ తేదీ నుంచి నగరవాసులకు అందుబాటులోకి వచ్చాయి. అంటే నేటికీ సుమారు 10 నెలలు కావస్తోందన్నమాట. ఈ 10 నెలలలో నాగోల్-అమీర్ పేట-మియాపూర్ కారిడర్లలో మొత్తం రెండు కోట్లు మంది ప్రయాణించారని మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ఎల్బీ నగర్-అమీర్ పేట్ కారిడార్ లో మెట్రో రైల్ సర్వీసులు కూడా అందుబాటులోకి వస్తే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నామని చెప్పారు. మెట్రో రైల్వే స్టేషన్లలో కొత్తగా ఉచిత మంచినీటి సౌకర్యం, విశ్రాంతి గదులు ఏర్పాటు చేశామని చెప్పారు. మెట్రో రైళ్లలోను, ప్లాట్ ఫారమ్స్ మీద కూడా రైళ్ళ రాకపోకల సమాచారాన్ని ప్రదర్శిస్తున్నామని ఎన్విఎస్ రెడ్డి చెప్పారు.