తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ వివిద అంశాలపై మీడియా ప్రశ్నలకు చాలా ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు.
టీఆర్ఎస్‌పై మీ విమర్శలు దేనికి? వాటిని వారు తీసిపడేస్తున్నారు కదా? అనే ప్రశ్నకు “టీఆర్ఎస్ పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మావంటి చదువుకొన్నవారు మాకు తెలిసిన విషయాలు, మాకు అర్ధమైన విషయాలను ప్రజలకు వివరించవలసిన బాధ్యత ఉంది. ఆనాడు సోక్రటీస్..ఏస్తుక్రీస్తు ఆనాటి పాలకులకు భయపడి నిజాలు చెప్పకుండా ఊరుకొంటే ఏమయ్యేది? అలాగే మేము చెపుతున్న విషయాలు టీఆర్ఎస్ పట్టించుకోకపోయినా మాకు అనవసరం. టీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, ఆవినేతి గురించి ప్రజలకు తెలిస్తే చాలు,” అని సమాధానం చెప్పారు.
పొత్తుల గురించి అడిగిన ప్రశ్నకు ఆయన కొత్తగా పెట్టిన మా పార్టీ ఇప్పుడిప్పుడే ప్రజలలోకి వెళుతోంది. కనుక మా గురించి ప్రజలకు తెలుపుకొంటున్న ఈ సమయంలో ఇతర పార్టీలతో పొత్తులు వద్దనుకొంటున్నామని సున్నితంగా చెప్పారు.
ఎన్నికలకు తెలంగాణ జనసమితి అభ్యర్ధుల ప్రకటన గురించి అడిగిన ప్రశ్నకు, “అభ్యర్ధుల పేర్లు ఎప్పుడు ప్రకటించలో ఎప్పుడు ప్రకటిస్తే మా పార్టీకి ఎక్కువ లబ్ది కలుగుతుందో ఆలోచించుకొని ఆప్పుడే మా పార్టీ అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తాము,” అని చెప్పారు.