
లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ధర్మపురి సంజయ్‌కి గురువారం నిజామాబాద్ జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన గత 19 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ సమయంలో ఈ కేసుకు సంబందించి ఆయన తమకు పూర్తిగా సహకరించారని, ఆయనపై తమ విచారణ పూర్తయిందని పోలీసులు చెప్పడంతో న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
ఆయన నిజామాబాద్ పట్టణంలో శాంఖరి నర్సింగ్ కళాశాలకు చెందిన 11 మంది విద్యార్ధినులు ఆయన తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు స్వయంగా హోమ్ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేయడంతో డిజిపి ఆదేశాల మేరకు నిజామాబాద్ ఫోర్త్ టౌన్ పోలీసులు ప్రాధమిక దర్యాప్తు జరిపి ఆయనపై నిర్భయ కేసుతో పలు సెక్షన్స్ క్రింద కేసులు నమోదు చేశారు. అరెస్టు భయంతో సంజయ్ వారం రోజులు అజ్నాతంలోకి వెళ్ళిపోయినప్పటికీ ఆ తరువాత స్వయంగా వచ్చి పోలీసులకు లొంగిపోవడంతో వారు ఆయనను అరెస్ట్ చేసి కోర్టు ఆదేశం మేరకు రిమాండ్ లో ఉంచారు.