ఇక శలవు

దశాబ్ధాలపాటు తెలుగు ప్రేక్షకులను తన అద్భుతమైన నటనతో అలరించి, రాజకీయాలలో తనదైన ముద్రవేసిన నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్‌ ఫిలిమ్ నగర్ లోని మహాప్రస్థానం శ్మశానవాటికలో అధికారిక లాంచనాలతో ముగిశాయి. ఆయన కుమారుడు నందమూరి కళ్యాణ్ రామ్ చితికి నిప్పంటించి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి గౌరవవందనం సమర్పించారు.