ఆమ్రపాలి జిహెచ్ఎంసికి బదిలీ

వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరుగా పనిచేసి అందరి ప్రశంశలు అందుకొన్న ఆమ్రపాలిని జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆ స్థానంలో పనిచేస్తున్న భారతి హోళికెరీని మంచిర్యాల జిల్లా కలెక్టరు నియమించబడ్డారు. కరీంనగర్ మున్సిపల్ కమిషనర్‌గా చేస్తున్న శశాంక జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టరుగా నియమించబడ్డారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టరుగా పనిచేస్తున్న రాజత్ కుమార్ సైనీని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరుగా నియమింపబడ్డారు. ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరుగా చేస్తున్న అమయ్ కుమార్ ను నిన్న భద్రాద్రి కొత్తగూడెంకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆఖరు నిమిషంలో ఆయన బదిలీని నిలిపివేసింది.