
మాజీ ఎంపీ, నటుడు నందమూరి హరికృష్ణ బుదవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు జిల్లాలో ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొని కారులో హైదరాబాద్ తిరిగి వస్తుండగా నల్గొండ జిల్లాలోని అన్నేపర్తి వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడటంతో కారులో ప్రయాణిస్తున్న నందమూరి హరికృష్ణ తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆయనతో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని నార్కాట్ పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రాధమిక సమాచారం ప్రకారం హరికృష్ణ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ విషయం తెలుసుకొన్న ఆయన కుటుంబ సభ్యులు, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ తదితరులు హైదరాబాద్ బయలుదేరారు.