కడియం శ్రీహరి బందువు ఆత్మహత్య

తెలంగాణా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుటుంబంలో నిన్న ఊహించని విషాదఘటన జరిగింది. ఖాజీపేటలో జూబ్లీ మార్కెట్ ప్రాంతంలో నివసిస్తున్న ఆయన చిన్నాన్న కుమార్తె కందుకూరి కన్యాకాపరమేశ్వరి (40) ఆత్మహత్య చేసుకొంది. ఆమెకు సుమారు 19 ఏళ్ల క్రితం నల్గొండకు చెందిన నర్సింగ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి రాహుల్, రోహిత్ అనే 18 సం.లు వయసున్న ఇద్దరు కవలలు ఉన్నారు. అయితే ఆ దంపతుల మద్య భేధాభిప్రాయాలు ఏర్పడటంతో ఆమె గత 10 ఏళ్లుగా ఖాజీపేటలోని తన తల్లిగారింట్లోనే ఉంటోంది. కుటుంబ కలహాల కారణంగా జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకొంటున్నట్లు లేఖ వ్రాసిపెట్టి ఆమె ఫ్యాంకుకు ఊరి వేసుకొని చనిపోయింది. ఈ సంగతి తెలుసుకొన్న కడియం శ్రీహరి దంపతులు వెంటనే ఖాజీపేట చేరుకొన్నారు. అనంతరం బందుమిత్రులతో కలిసి స్థానిక విద్యానగర్ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్నారు.