100 సీట్ల ప్రచారం అందుకే: కోదండరామ్

తెలంగాణా జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “   టిఆర్ఎస్‌తో సహా రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ఇంతవరకు సర్వే చేయించలేదు. సొంత పార్టీ నేతలు ఇతర పార్టీలలోకి వెళ్లిపోకుండా కాపాడుకోవడం కోసమే సర్వే పేరుతో కెసిఆర్‌తో సహా అందరూ మాయమాటలు చెపుతున్నారు.  టిఆర్ఎస్‌కు 100 సీట్లు వస్తాయని సిఎం కెసిఆర్‌ చెప్పుకోవడం శుద్ధ అబద్దం. కెసిఆర్‌ తన పార్టీలో సమస్యలను, ప్రభుత్వ వైఫల్యాల నుంచి అందరి దృష్టి మళ్లించడానికే ముందస్తు ఎన్నికలు, 100 సీట్లు పాట పాడుతున్నారు. అయితే టిఆర్ఎస్‌లో నెలకొన్న అంతర్గత సమస్యలను పరిష్కరించడం అంత సులువేమీ కాదు. ఆయన సర్వేలు చేయించానని చెపుతున్నారు. దమ్ముంటే ఆ సర్వే నివేదికను బయటపెట్టమనండి,” అని కెసిఆర్‌కు సవాలు విసిరారు.