కేరళకు జగన్ భారీ విరాళం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కేరళ వరదభాధితుల సహాయార్ధం కోటి రూపాయలు విరాళం  ప్రకటించారు. "కష్టకాలంలో ఉన్న కేరళ ప్రజలను ఆదుకోవలసిన భాద్యత మనందరి మీద ఉంది. అందుకే నా తరపున, మా పార్టీ తరపున కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయలు విరాళం అందజేస్తున్నాము," అని చెప్పారు.