టిఆర్ఎస్‌ తీర్మానాలు


సోమవారం తెలంగాణా భవన్ లో జరిగిన టిఆర్ఎస్‌ కార్యవర్గ సమావేశంలో తొమ్మిది తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. వాటిని కేంద్రానికి పంపించి అమలుచేయవలసిందిగా కోరుతామని సిఎం కెసిఆర్‌ చెప్పారు. ఆ తీర్మానాల వివరాలు:

1. విభజన చట్టంలో తెలంగాణాకు ఇచ్చిన హామీలను అన్నిటినీ కేంద్రం అమలుచేసి, విభజన ప్రక్రియను పూర్తి చేయాలి.

2. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.20,000 కోట్లు నిధులు ఇవ్వాలి.

3. వరి, మొక్కజొన్న పంటలకు కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.2,000 ఇవ్వాలి.    

4. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచుకొనే అధికారం రాష్ట్రానికి ఇవ్వాలి.

5. ఎస్సీ వర్గీకరణపై కేంద్రం తక్షణమే నిర్ణయం తీసుకోవాలి. 

6. దేశంలో అత్యధిక జనాభాగా ఉన్న బీసీల సంక్షేమం కోసం బీసీ సంక్షేమ శాఖను ఏర్పాటు చేయాలి.

7. బీసీలు, మహిళలకు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలి. అంధుకోసం అవసరమైతే లోక్‌సభ స్థానాల సంఖ్య పెంచాలి. 

8. వ్యవసాయం, విద్యా, ప్రజారోగ్యం వంటి అంశాలపై పూర్తి అధికారాలు రాష్ట్రాలకే ఉండాలి. 

9. ఉపాధిహామీ పధకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి.