సంబంధిత వార్తలు

హైదరాబాద్లో నగరంలో ట్రాఫిక్ పోలీసులు తరచూ డ్రంకన్ డ్రైవ్ చేపడుతున్నప్పటికీ మద్యం త్రాగి వాహనాలు నడిపేవారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతీసారి ఎవరో ఒక ప్రముఖుడో లేక వారి పుత్రరత్నాలో పట్టుబడుతూనే ఉన్నారు. శుక్రవారం రాత్రి నగరంలో జూబ్లీ హిల్స్ ప్రాంతంలో పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనికీలు నిర్వహించగా సీనియర్ కాంగ్రెస్ నేత మల్లు రవి కుమారుడు సిద్దార్థ్ మద్యం త్రాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. పోలీసులు అతని కార్ టిఎస్-09-ఈఆర్-7777ను స్వాధీనం చేసుకొని స్టేషన్ కు తరలించి అతనిపై కేసు నమోదు చేశారు.