వంతెనపై నుంచి పడిన ఆర్టీసి బస్సు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈరోజు ఉదయం ఒక ఆర్టీసి బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి క్రింద పడిపోయింది. భద్రాచలం నుంచి విజయవాడకు వెళుతున్న ఆర్టీసి బస్సు బూర్గంపాడు మండలంలో రెడ్డిపాలెం గ్రామ శివారు వద్ద గల వాగువంతెనపై నుంచి ప్రయాణిస్తుండగా, అదుపుతప్పి క్రిందపడిపోయింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే అదృష్టవశాత్తు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. పదిమందికి తీవ్ర గాయలయినట్లు తెలుస్తోంది. సమాచారం అందగానే పోలీసులు అక్కడకు చేరుకొని గాయపడినవారిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.