
తెలంగాణా రాష్ట్రంలో 166మంది నాయబ్ తహసిల్దార్లకు (డిప్యూటీ తహసిల్దార్లు) తహసిల్దార్లుగా పదోన్నతి కల్పిస్తున్నట్లు పదోన్నతుల కమిటీ (డిపిసి) మంగళవారం ప్రకటించింది. ఈ కమిటీలో రాష్ట్ర రెవెన్యూశాఖ ప్రత్యేక కార్యదర్శి, ఇన్-ఛార్జ్ సిసిఎల్ఏ రాజేశ్వర్ తివారీ, ఆ శాఖకు చెందిన ఇన్-ఛార్జ్ కార్యదర్శి రజత్ కుమార్ షైనీ, ఎక్సైజ్ శాఖ కమీషనర్ సోమేశ్ కుమార్ సభ్యులుగా ఉన్నారు.
జోన్-5 క్రింద వచ్చే పూర్వ ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలలో 73మందికి, జోన్-6లో హైదరాబాద్‌లో, రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాలలో 93మందికి తహసిల్దార్లుగా పదోన్నతులు కల్పించినట్లు కమిటీ ప్రకటించింది. త్వరలోనే వారందరినీ ఆయా జిల్లాలకు కేటాయించబడతారు.