
తమిళనాడులోని డిఎంకె అధినేత కరుణానిధి మృతికి సంతాపంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం వారం రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. కేంద్రప్రభుత్వం కూడా బుధవారం ఒకరోజు దేశవ్యాప్తంగా సంతాపదినంగా పాటించాలని నిర్ణయించింది. అన్ని రాష్ట్రాల రాజధాని నగరాలలో ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయజెండాలను అవనతం చేసి సంతాపం పాటించాలని కేంద్రం ఆదేశించింది. ఇదివరకు అంటే 2016లో జయలలిత చనిపోయినప్పుడు కూడా కేంద్రం ఒకరోజు సంతాపదినం ప్రకటించింది. బిహార్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అయన మృతికి రెండు రోజులు సంతాపదినాలుగా ప్రకటించింది.
కరుణానిధి భౌతికకాయానికి అధికారిక లాంచనాలతో ఈరోజు సాయంత్రం అంత్యక్రియలు జరుగనున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ, ఏపి, తెలంగాణా, పశ్చిమబెంగాల్, తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు ఆయన అంత్యక్రియలలో పాల్గొనేందుకు చెన్నై వస్తున్నారు.