
మాజీ కేంద్రమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి రచించిన ‘టెన్ ఐడియాలజీస్’ అనే పుస్తకాన్ని మాజీ ప్రధాని డాక్టర్. మన్మోహన్ కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం డిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ జైపాల్ రెడ్డి గొప్ప మేధావి అని ప్రశంశించారు. రాజకీయనాయకులకు ఎటువంటి సామాజిక దృక్పధం కలిగి ఉండాలో ఈ పుస్తకంలో శాస్త్రీయంగా వివరించారని అన్నారు.
జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, “గత 45 ఏళ్లుగా రాజకీయాలలో ఉన్నాను. నా ఈ సుదీర్ఘ రాజకీయ ప్రస్తానంలో జనతాపార్టీ, జనతాదళ్, కాంగ్రెస్ పార్టీలలో పని చేసి వివిధపార్టీల సిద్దాంతాలు, వాటి ఆలోచనా విధానాలను అర్ధం చేసుకొనే అవకాశం కలిగింది. నాకు తెలిసిన ఆ విషయాలకె అక్షర రూపం ఇచ్చి ఈ పుస్తకం రచించాను,” అని చెప్పారు.
డిల్లీలో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి సోదరులు, రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క, మల్లు రవి, శ్రీధర్ బాబుతో పాటు తెలంగాణా జనసమితి (టిజెఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కూడా హాజరుకావడం విశేషం.