పాతబస్తీలో ఐసిస్ సానుభూతిపరులు?

జాతీయ దర్యాప్తు బృందం (ఎన్.ఐ.ఏ) రెండేళ్ళ క్రితం హైదరాబాద్‌ పాతబస్తీలో సోదాలు జరిపి కొంతమంది యువకులను అదుపులోకి తీసుకొని విచారించడం చాలా కలకలం రేపింది. వారు కరడుగట్టిన ఐసిస్ ఉగ్రవాద సంస్థకు సానుభూతిపరులని ఎన్.ఐ.ఏ. గుర్తించింది. వారిలో ఇద్దరు వ్యక్తుల నుంచి మారణాయుధాలు కూడా స్వాధీనం చేసుకొంది. కానీ వారికి గట్టిగా హెచ్చరికలు చేసి విడిచిపెట్టింది. వారిలో కొందరు మళ్ళీ ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు నెరుపుతున్నట్లు అనుమానించిన ఎన్.ఐ.ఏ. బృందాలు మంగళవారం పాతబస్తీలో సొదలు నిర్వహించి ఖలీద్ అహ్మద్, బాసిత్, సన, ఖాజా, మహమ్మద్ అబ్దుల్ ఖదీర్, అతని తండ్రి అబ్దుల్ ఖుద్దూస్ లను అదుపులో తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఎన్.ఐ.ఏ. బృందాలు మళ్ళీ పాతబస్తీలో ప్రవేశించి ఆరుగురిని అదుపులోకి తీసుకోవడంతో పాతబస్తీలో మళ్ళీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.