డిసిసి అధ్యక్షుల నియామకానికి గ్రీన్ సిగ్నల

జిల్లాల పునర్విభజనతో తెలంగాణాలో 31 జిల్లాలు ఏర్పడినప్పటికీ, కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు కాంగ్రెస్‌ అధ్యక్షులను నియమించుకోవడానికి కాంగ్రెస్‌ అధిష్టానం అనుమించకపోవడంతో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ పాత పది జిల్లాల ప్రకారమే జిల్లా అధ్యక్షులను నియమించుకొని పని కానిచ్చేస్తోంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నందున 31 జిల్లాలకు డిసిసి అధ్యక్షుల నియామకాలు చేయడానికి కాంగ్రెస్‌ అధిష్టానం అనుమతించింది. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ సోమవారం ప్రకటించారు. కనుక త్వరలోనే మిగిలిన 21 జిల్లాలకు డిసిసి అధ్యక్షుల నియామకాల ప్రక్రియ మొదలవవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం ఏ స్థాయిలో కీచులాటలు జరుగుతుంటాయో అందరికీ తెలుసు. కనుక ఈ పదవులను భర్తీ చేయడం రాష్ట్ర కాంగ్రెస్‌ అధిష్టానానికి కొత్త తలనొప్పులు కలిగించవచ్చు. దీని వలన పార్టీ నేతలలో అసంతృప్తి, అలకలు మొదలైతే వారికి సర్దిచెప్పడం, వారి వలన పార్టీకి నష్టం కలుగకుండా చూసుకోవడం రాష్ట్ర కాంగ్రెస్‌ పెద్దలకు కొంచెం కష్టమైన పనే కావచ్చు.