
సీనియర్ తెలంగాణా కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణా రెడ్డిపై కొమురెల్లి విజయలక్ష్మి అనే మహిళ హన్మకొండ సుబెదారీ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది.
హన్మకొండకు చెందిన విజయలక్ష్మి మదర్ ఫౌండేషన్ లో పనిచేస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆమెకు ఐదేళ్ళ క్రితం గండ్ర వెంకటరమణతో పరిచయం ఏర్పడింది. క్రమండగా వారి పరిచయం శారీరిక సంబంధానికి దారి తీసిందని గత ఐదేళ్ళుగా తమ మద్య శారీరిక సబంధం ఉండదని విజయలక్ష్మి చెప్పింది. ఎప్పటిలాగే ఆగస్ట్ 3వ తేదీ రాత్రి అయన నివాసానికి వెళ్ళిన్నప్పుడు, గండ్ర పిర్యాదు మేరకు తనను పోలీసులు అరెస్ట్ చేసారని ఆమె తెలిపింది. అందుకు నిరసనగా ఆమె తన అనుచరులతో కలిసి వడ్డేపల్లిలో గండ్ర నివాసం ఉంటున్న జిఎంఆర్ అపార్ట్మెంట్ ముందు ధర్నా చేసింది. ఈ సమాచారం అందుకొన్న పోలీసులు మళ్ళీ ఆమెను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించగా, ఆమె గండ్రపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరింది. తనను ఐదేళ్ళు వాడుకొని వదిలేసిన గండ్రను కాంగ్రెస్ పార్టీ నుంచి తక్షణం బహిష్కరించాలని డిమాండ్ చేసింది. పోలీసులు ఆమె పిర్యాదు మేరకు గండ్ర వెంకటరమణపై ఐపిసి సెక్షన్స్ 420,417,506,505ల క్రింద కేసు నమోదు చేశారు.