
లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెరాస ఎంపి డి.శ్రీనివాస్ కుమారుడు సంజయ్‌పై నిజామాబాద్ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో నిర్భయ చట్టం క్రింద కేసు నమోదు చేశారు. దానితో పాటు ఐపిసి సెక్షన్స్ 354,354ఏ,342ల క్రింద కేసులు నమోదు చేశారు. తనపై నిర్భయ కేసు నమోదు అయిన సంగతి తెలుసుకొన్న వెంటనే సంజయ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. పోలీసులు అయన కోసం గాలిస్తున్నారు. శుక్రవారం ఉదయం అయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తనను రాజకీయంగా దెబ్బ తీసేందుకు ఈ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఒకవేళ అయన తను ఎటువంటి తప్పు చేయలేదని భావిస్తే అజ్ఞాతంలోకి వెళ్ళకుండా ధైర్యంగా ఈ కేసును ఎదుర్కోవచ్చు కదా?