నేటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన షురూ

రాష్ట్రంలో గ్రామపంచాయితీ పాలకవర్గం పదవీకాలం నిన్నటితో ముగియడంతో నేటి నుంచి పంచాయితీలలో సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గం సభ్యులు అందరూ మాజీలు అయ్యారు. కనుక నేటి నుంచి అన్ని పంచాయితీలలో ‘స్పెషల్ ఆఫీసర్ల’ పాలన మొదలవుతుంది. రాష్ట్రంలో పాతవి, కొత్తగా ఏర్పాటు చేసిన పంచాయతీలను కలుపుకొని మొత్తం 12,733 పంచాయితీలున్నాయి. వాటన్నిటికీ ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. మళ్ళీ ఎన్నికలు నిర్వహించి, పాలకవర్గం ఏర్పడేవరకు స్పెషల్ ఆఫీసర్లే పంచాయితీల పాలనా వ్యవహారాలను చూస్తారు. కొత్తగా ఏర్పాటయిన పంచాయితీలకు శాశ్విత భావనలు నిర్మించేవరకు ఆ పంచాయితీ పరిధిలో ఉండే ప్రభుత్వ భవనం ఏది ఉంటే దానిని వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో బిసి జనాభా లెక్కలు పూర్తయ్యే వరకు పంచాయితీ ఎన్నికలు నిర్వహించరాదని హైకోర్టు తీర్పు చెప్పింది కనుక మరొక రెండు మూడు నెలల వరకు పంచాయితీలలో స్పెషల్ ఆఫీసర్ల పాలన సాగే అవకాశం ఉంది.