రైతుభీమా పధకానికి దరఖాస్తు చేసుకొనేందుకు జూలై 20వ తేదీ గడువుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ వివిధ కారణాల చేత నేటికీ రాష్ట్రంలో అనేకవేలమంది రైతులు దరఖాస్తులు సమర్పించలేకపోయారు. కనుక ఆ గడువును జూలై 31వ తేదీకి పొడిగించింది. ఈ పధకాన్ని ఆగస్ట్ 15వ తేదీ నుంచి ప్రారంభించాలని భావిస్తునందున మళ్ళీ మరోమారు గడువు పొడిగించే అవకాశం ఉండకపోవచ్చు. ఈ నెలాఖరులోగా దరఖాస్తులు సమర్పించిన రైతులకు మాత్రమే ఆగస్ట్ 15వ తేదీన జీవితభీమా బండ్లు అందజేయబదతాయని అధికారులు చెపుతున్నారు. కనుక రైతులందరూ వీలైనంత త్వరగా దరఖాస్తులు సమర్పించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ పధకం వివరాలు:
1. 18 నుంచి 59 ఏళ్ళు వయసున్న రైతులందరూ ఈ పధకానికి అర్హులే.
2. దీనికోసం రైతులు ఒక్క పైసా కూడా ప్రీమియం చెల్లించనవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వమే ఒక్కో రైతు తరపున రూ.2,271 ప్రీమియం చెల్లిస్తుంది.
3. ఒకవేళ ఏ కారణం చేత రైతు చనిపోయినా, అతను లేదా ఆమె కుటుంబసభ్యులకు 10 రోజులలోపు రూ.5 లక్షలు జీవితభీమాసంస్థ (ఎల్.ఐ.సి) చెల్లిస్తుంది.