గుడిపల్లి పంప్ హౌజ్ ప్రారంభం

మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పధకం (కెఎల్ఐ)లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాలో గుడిపల్లి వద్ద నిర్మించిన పంప్ హౌసులో మూడవ లిఫ్ట్ మోటార్ ను రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్ది, చిన్నారెడ్డి కలిసి ప్రారంభించారు. అనంతరం పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న కృష్ణా జలాలకు పూజలు చేసి పూలు సంపర్పించుకొన్నారు. 

ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “గతంలో సమైక్య రాష్ట్రాన్ని పాలించిన పాలకులు ఎవరూ నాగర్ కర్నూల్ ను పట్టించుకోకపోవడం ఈ ప్రాంతంలో సాగు నీరులేక తీవ్ర దుర్భిక్షపరిస్థితులు నెలకొని ఉండేవి. కానీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రులు, ప్రజా ప్రతినిధులు ప్రాజెక్టుల వద్దనే రాత్రుళ్ళు పడుకొంటూ రేయింబవళ్ళు పనిచేసి ప్రాజెక్టులను పూర్తిచేస్తున్నాము. గతంలో ఈ ప్రాజెక్టుకు 25 టిఎంసిలు వాడుకోవడానికే అనుమతి ఉండగా మేము పోరాడి 40 టిఎంసిలు సాధించాము. కనుక ఇక నుంచి జిల్లాలో రైతులు రెండు పంటలు వేసుకోవచ్చు. రైతుల సంక్షేమం కోసం ఇంతగా కృషి చేస్తున్న మా ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికలలో ప్రజలు ఆశీర్వదిస్తారని కోరుకొంటున్నాము. ప్రాజెక్టుల గురించి బొత్తిగా అవగాహన, చిత్తశుద్దిలేని కాంగ్రెస్‌ నేతల మాటలను పట్టించుకొనవసరం లేదు,” అని అన్నారు.