మేడ్చల్ నుంచి నేనే..మరెవరికీ నో ఛాన్స్!

ఎన్నికలలో పోటీ చేసి గెలవడం ఒక ఎత్తు. అంతకంటే ముందు పార్టీ టికెట్ సంపాదించుకోవడం ఇంకా కష్టం. ప్రస్తుతం తెలంగాణా కాంగ్రెస్‌ నేతలెదుర్కొంటున్న పెద్ద సమస్య ఇదే. ఉదాహరణకు మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ముగ్గురు నేతలు పోటీలు పడుతున్నారు. 

గతంలో కాంగ్రెస్‌ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయిన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, మాజీ టిపిసిసి ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, ఇటీవల రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన తోటకూర వజ్రేష్ యాదవ్ ముగ్గురూ మేడ్చల్ టికెట్ తమదేనని నమ్మకంతో ఉన్నారు.

మాగం రంగారెడ్డి ఆదివారం మేడ్చల్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఇక్కడ నుంచి నేనే పోటీ చేయబోతున్నాను. మా పార్టీ అధిష్టానం నాకు ఎప్పుడో హామీ ఇచ్చింది. కొంతమంది స్థానికేతరులు, గతంలో పోటీ చేసి ఓడిపోయినవారు ఈసారి మేడ్చల్ నుంచి పోటీ చేయబోతున్నామని ప్రచారం ఇక్కడ నేను తప్ప ఎవరూ పోటీ చేయరు. చేయనినివ్వను కూడా. కాంగ్రెస్‌ నేతలు టికెట్ల కోసం పోటీ పడటం మామూలు విషయమే. కానీ పార్టీ అధిష్టానం ఇంకా అభ్యర్ధులపేర్లను ఖరారు చేయకనుందే ఎవరికి వారు ఈవిధంగా ప్రకటనలు చేస్తుండటం విశేషం. కాంగ్రెస్‌ అధిష్టానం ఇంకా ఆలస్యం చేస్తే, టికెట్ల కేటాయింపు చేయవలసిన అవసరం ఉండదేమో?