5.jpg)
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం ప్రగతిభవన్‌లో సుమారు ఏడు గంటలపాటు సుదీర్ఘంగా మంత్రివర్గ సమావేశం జరిగింది. దానిలో అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొన్నారు. ఆ వివరాలు:
1. ప్రతీ జిల్లా కేంద్రంలో అధికార తెరాసతో సహా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలన్నిటికీ ఒక్కో పార్టీకి గజం వందరూపాయల చొప్పున ఎకరం స్థలం కేటాయింపు.
2. సూర్యాపేటలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి, సిబ్బంది నియమకాలు.
3. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేసిన అన్ని గ్రామపంచాయతీలకు 9,355మంది గ్రామ కార్యదర్శులను నియమకాలు. పదవీకాలం ముగిసిన సర్పంచ్ ల స్థానంలో స్పెషల్ ఆఫీసర్ల నియామకాలు. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన మునిసిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్లను నియామాకాలకు ఆమోదం తెలిపింది.
4. రాష్ట్రంలో బిసి జనాభాను లెక్కించే కార్యక్రమం వెంటనే ప్రారంభించాలని నిర్ణయించింది.
5. ఆగస్ట్ 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కంటి పరీక్షల కార్యక్రమం కంటి వెలుగు పధకాన్ని ప్రారంభం.
6. వచ్చే ఏడాది నుంచు రాష్ట్రంలో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున 119 బిసి గురుకుల పాఠశాలలను ఏర్పాటు, వాటిలో 4,284 మంది అధ్యాపకులు, ఇతర సిబ్బందిని నియమకాలు.
7. ప్రతీ నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం చొప్పున తొలి విడతలో 18 కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
8. రాష్ట్ర పోలీష్ శాఖకు కొత్తగా 11, 577 వాహనాల కొనుగోలు.
9. భారత్ సరిహద్దులలో పోరాడుతూ వీరమరణం పొందిన జవాను ఫిరోజ్ ఖాన్ కుటుంబానికి షేక్ పేటలో 200 గజాల ఇంటి స్థలం కేటాయింపు.
10. మందుపాతర ప్రేలుడులో మరణించిన మాజీమంత్రి మాధవరెడ్డి కుటుంబానికి షేక్ పేటలో 600 గజాల ఇంటి స్థలం కేటాయింపు.