సంబంధిత వార్తలు

రాజకీయ దురుదేశ్యంతోనే తెరాస సర్కార్ పంచాయితీ ఎన్నికలను వాయిదా పడేలా చేసిందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, వెంకటరమణి ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికలు ఈసారి కొంచెం ముందుగా జరిగే అవకాశాలు కనిపిస్తునందున, ప్రత్యేకాధికారుల ద్వారా గ్రామాల పాలనా వ్యవహారాలను సిఎం కెసిఆర్ తన చెప్పుచేతలలోకి తీసుకోవడానికే ఈ ఎత్తు వేశారని ఆరోపించారు. ఇప్పటికిప్పుడు పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తే తెరాసకు వ్యతిరేకంగా ఓట్లు పడతాయనే భయంతోనే ఎన్నికలు జరగకుండా చేశారని భాజపా నేతలు ఆరోపించారు. సిఎం కెసిఆర్ కు చిత్తశుద్ధి ఉంటే తక్షణం పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు.