కార్లు మార్చినట్లు భార్యలను మారుస్తాడు

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడును తిట్టిపోయడంలో ఉన్న ఆసక్తి మరిదేనిపైనా లేదనే చెప్పాలి. అందుకే అయన విమర్శలలో కాంగ్రెస్‌, భాజపా, జనసేన తదితరపార్టీల నేతల పేర్లు ఎన్నడూ వినబడవు. కానీ మంగళవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం టైం వేస్ట్. రాజకీయ పరిపక్వతలేని అటువంటి వ్యక్తి చెపుతున్న మాటలను వినడం..మళ్ళీ వాటిపై స్పందించవలసిరావడం మన కర్మ. పవన్ కళ్యాణ్ నోరు విప్పితే విలువల గురించి మాట్లాడుతుంటాడు. ప్రతీ నాలుగైదేళ్ళకోసారి కారు మార్చినట్లు భార్యలను మార్చే అతనికేమి విలువలున్నాయి?అదే ఆతని స్థానంలో మరెవరైనా ఉంటే ఈపాటికి జైలుకు వెళ్లి ఉండేవారు,” అని అన్నారు.