నేడు ఏపి బంద్

ఏపికి ప్రత్యేకహోదా తదితర విభజన హామీలను అమలుచేయనందుకు నిరసనగా వైకాపా నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్ నిర్వహిస్తోంది. విభజన హామీల అమలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశాయని వైకాపా ఆరోపిస్తోంది. ఈరోజు తెల్లవారుజాము నుంచే వైకాపా నేతలు, కార్యకర్తలు ఆర్టీసి డిపోల వద్దకు చేరుకొని ధర్నా చేపట్టడంతో అనేక చోట్ల డిపోలలో నుంచి బస్సులు బయటకు రాలేదు. ప్రత్యేకహోదా కోసం పోరాడిన నటుడు శివాజీ, ప్రత్యేకహోదా సాధన సమితి నేతలు, కాంగ్రెస్ పార్టీ, జనసేన, వామపక్షాలు ఎవరూ కూడా వైకాపా బంద్ కు మద్దతు ఇవ్వకపోవడం విశేషం. కనుక వైకాపా ఒంటరిగా బంద్ నిర్వహిస్తోంది. రాష్ట్రంలో అన్ని బస్సు డిపోలలో బారీగా పోలీసులను మొహరించి, బస్సులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన వైకాపా నేతలను, కార్యకర్తలను అదుపులోకి తీసుకొంటున్నారు.