
హైదరాబాద్ నగరంలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులను తప్పించడానికి నగరంలో అనేక ఫ్లై ఓవర్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇవాళ్ళ మరో రెండు ఫ్లై ఓవర్లకు మున్సిపల్ శాఖామంత్రి కేటిఆర్ శంఖుస్థాపన చేశారు. ఒకటి కొండాపూర్ వద్ద మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్ మరొకటి గచ్చిబౌలి నుంచి హఫీజ్ పేట్ కు వెళ్ళే నాలుగు లైన్ల ఫ్లై ఓవర్. బొటానికల్ గార్డెన్ నుంచి ఓల్డ్ బాంబే-కొండాపూర్ మీదుగా హైటెక్ సిటీని కలుపుతూ రూ 263 కోట్లు వ్యయంతో ఈ మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్‌ను నిర్మించబోతున్నారు. ఈ రెండు ఫ్లై ఓవర్ల నిర్మాణం పూర్తయితే హైటెక్ సిటీలో ఉద్యోగాలు చేస్తున్నవారికి చాలా ఉపశమనం కలుగుతుంది. మరోవైపు అమీర్ పేట-హైటెక్ సిటీని కలుపుతూ మెట్రో రైల్ నిర్మాణపనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మార్గంలో మెట్రో రైళ్ళు అందుబాటులోకి వస్తే రోజూ హైటెక్ సిటీకి వెళ్ళేవారు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా వెళ్ళిరావచ్చు.